వరద బాధితులకు BRS విరాళం.. KCR ఆదేశాలతో హరీష్ ప్రకటన

By Margam

Published on:

Follow Us
వరద బాధితులకు BRS విరాళం.. KCR ఆదేశాలతో హరీష్ ప్రకటన


Telegram Channel Join Now
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్ జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కవగా ఉంది. లక్షల మంది నిరాశ్రయులుగా మారారి. ఇల్లు, వాకిలి కొట్టుకుపోవటంతో పాటు పంట పొలాలు ధ్వంసమయ్యాయి. పాడి పశువులు కూడా వరదలో గల్లంతయ్యాయి. దీంతో ఆ జిల్లాల ప్రజలకు కన్నీరే మిగిలింది. వరద ముంపు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. వారికి సాయం చేసేందుకు పలవురు దాతలు ముందుకు వస్తున్నారు.ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఏకంగా రూ. 130 కోట్లు సీఎం సహాయ నిధికి అందించింది. ఈ నేపథ్యంలో తాజాగా.. వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకొచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. మాజీ సీఎం, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే ఈ ప్రకటన చేస్తున్నట్లు సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో పాటు ఖమ్మం వరద బాధితులకు ఆదుకుంటామని వారికి.. నిత్యావసర సరకులు పంపించేందుకు ఏర్పాట్లు ఆయన చేస్తున్నారు.

‘వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన సహాయక చర్యలు చేపట్టింది. అందుకు తోడుగా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యుల ఒక నెల జీతాన్ని వారికి అందించనున్నాం. ప్రజల కష్టాల్లో తోడుండే బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కూడా విలయం సృష్టించిన విపత్తులో ప్రజలతో ప్రజల పక్షాన నిలబడింది. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు.

ఇక సినీ హీరో ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. చెరో రూ. కోటి చొప్పున రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. సోనూ సూద్ సైతం చేరో రూ. కోటి చొప్పున రూ.2 కోట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ ఏపీ, తెలంగాణకు రూ.50 లక్షల చొప్పున రూ. కోటి ప్రకటించగా.. మెగాస్టార్ చిరంజీవి కూడా చెరో రూ.50 లక్షల చొ ప్పున రూ. కోటి విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే పలువురు సినీ హీరోలు విరాళం ప్రకటించగా.. మరికొందరు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు.

Source link

Leave a Comment