డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సీఐతో పాటు మృతుడి కుటుంబ సభ్యులు చేరుకుని రాంకీ అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కంపెనీలో ఏదో ప్రమాదం జరిగితే మృతదేహాన్ని ట్యాంకు లోపల పడేశారని మృతుడి బంధువులు, కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, పరవాడ జెడ్‌పీటీసీ సభ్యులు ఎస్.రాజు చేరుకున్నారు. అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రొడక్షన్ మేనేజర్ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.