Weather update: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో భారీ వానలు.. ఈ జిల్లాలలో శనివారం స్కూళ్లకు సెలవు

By Margam

Published on:

Follow Us
Weather update: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో భారీ వానలు.. ఈ జిల్లాలలో శనివారం స్కూళ్లకు సెలవు



Telegram Channel Join Now
ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం.. వాయుగుండంగా మారినట్లు ఏపీ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడిందన్న వాతావరణ శాఖ.. వాయవ్య దిశగా పయనించి శనివారం తెల్లవారుజామున పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీన పడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో శనివారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు వాయుగుండం తీరే దాటే క్రమంలో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే కాకినాడ, కోనసీమ అంబేద్కర్ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వీటితో పాటు బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.ఏపీలో భారీ వర్షాలు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అత్యవసర చర్యల కోసం మూడు ఎస్టీఆర్‌ఎఫ్, 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రోణంకి కూర్మనాథ్ తెలిపారు.వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ, భీమిలి పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మరోవైపు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

Source link

Leave a Comment