విజయవాడలో మహిళా వీఆర్వో తీరుపై ప్రభుత్వం సీరియస్.. వెంటనే కలెక్టర్ యాక్షన్

By Margam

Published on:

Follow Us
విజయవాడలో మహిళా వీఆర్వో తీరుపై ప్రభుత్వం సీరియస్.. వెంటనే కలెక్టర్ యాక్షన్


Telegram Channel Join Now
విజయవాడలో వరద బాధితుడిపై వీఆర్వో దాడి చేసిన ఘటన కలకలంరేపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో గౌరవంగా, మర్యాదగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో సూచించారు. కానీ ఓ మహిళా వీఆర్వో మాత్రం దురుసుగా ప్రవర్తించారు.. సహనం కోల్పోయి ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించగా.. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి‌ సత్వరమే స్పందించి ఆమెకు షోకాజ్‌ జారీ చేశారు.ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని 58వ డివిజన్‌ షాదీఖానా దగ్గర.. సోమవారం ఉదయం వరద బాధితులకు ఇంటి దగ్గరే అధికారులు వచ్చి పోలీసుల సమక్షంలో నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. స్థానిక వీఆర్వో విజయలక్ష్మి ఈ పంపిణీని పర్యవేక్షించారు.. తమ వీధిలో వరదలు వచ్చినప్పటి నుంచి ఆహారం, మంచినీరు అందలేదని కొందరు వరద బాధితులు ప్రశ్నించారు. ఈ క్రమంలో మహిళా వీఆర్వో, వరద బాధితుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వీఆర్వో పోలీసులు ఉండగానే వరద బాధితులను దుర్భాషలాడుతూ యాసిన్‌ అనే యువకుడి చెంపపై కొట్టారు.

ఈ ఘటనతో అక్కడే విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అవాక్కయ్యారు. బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి పంపించారు.. ఆమె కూడా బాధితులను వీడియో తీసి జరిగిన ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురించి తెలియడం, చెంపపై కొట్టిన వీడియో వైరల్ కావడంతో.. సహాయక చర్యల్లో నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించినట్లు ఫిర్యాదు అందడంతో వీఆర్వో విజయలక్ష్మికి కలెక్టర్‌ సృజన షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఈ ఘటనపై రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. వరద సాయం, బాధితుల విషయంలో ఉద్యోగులు నిర్లక్ష్యం వహించినా, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. తనపై దాడి చేసిన తరువాత వీఆర్వో విజయలక్ష్మి తన భర్తకు ఫోన్‌ చేశారని బాధితుడు యాసిన్ అంటున్నారు. ఆయన వచ్చి తమను దుర్భాషలాడారని ఆరోపించారు. తమను చంపేస్తానని బెదిరిస్తున్నారని.. ఈ సంఘటనలో తమపై దాడి చేసిన వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Source link

Leave a Comment