హరియాణా నుంచి ఒలింపిక్స్‌ వరకు, ఓ ఛాంపియన్‌ ప్రస్థానం

By Margam

Published on:

Follow Us
హరియాణా నుంచి ఒలింపిక్స్‌ వరకు, ఓ ఛాంపియన్‌ ప్రస్థానం


Telegram Channel Join Now

Who is Sarabjot Singh: భయమా.. అంటే ఎంటీ.. ఇది ఓ సినిమాలో హీరో డైలాగ్‌.. ఇప్పుడు ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సరబ్‌జోత్‌(Sarabjot Singh) కూడా ఇదే బాపత్తు. ఒత్తిడా… అంటే ఏంటీ అని కాంస్య పతక పోరులో గెలిచిన అనంతరం సరబ్‌జోత్‌ వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్‌(Olympics 2024)లో పతకం గెలిచిన అనంతరం సరబ్‌జోత్‌ చేసిన ప్రకటన షూటింగ్‌పై అతని గురి కుదరటానికి నిదర్శనంగా నిలిచింది. తాను ఎప్పుడు ఎలాంటి ఒత్తిడి అనుభవించనని… తాను ఏం చేయగలనో అది వంద శాతం అందిస్తానని సరబ్‌జోత్‌ తెలిపాడు. షూటింగ్‌లో ఒత్తిడి అనుభవిస్తే ఆ ప్రభావం కనిపిస్తుందని అన్నాడు. 

 

సరిగ్గా పుష్కరం తర్వాత…

షూటింగ్‌లో గగన్‌ నారంగ్‌ కాంస్య పతకం గెలిచి ఇవాళ్టీకి సరిగ్గా పుష్కరం. సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2012 జులై 30న గగన్‌ నారంగ్‌ విశ్వ క్రీడల్లో ఒలింపిక్‌ పతకం సాధించాడు. సరిగ్గా పుష్కరం తర్వాత సరబ్‌జోత్‌ సింగ్‌ భారత్‌కు మరో పతకం అందించి సత్తా చాటాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ విభాగంలో బరిలోకి దిగిన సరబ్‌జోత్‌ సింగ్‌ త్రుటిలో ఫైనల్‌ బెర్తును కోల్పోయాడు. ఆ ఓటమి సరబ్‌జోత్‌ను కుంగదీయలేదు. మరింత బలంగా తయారు చేసింది. అయిపోయిన దాని గురించి బాధ పడలేదు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సత్తా చాటాలని భావించాడు. అదే నిజమైంది 10 మీటర్ల  ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక పోరులో మనూ బాకర్‌తో కలిసి అద్భుతం చేశాడు. భారత్‌కు రెండో పతకం అందించాడు. ఈ పతకం సాధించేందుకు తనెంత తపన పడ్డాడో.. ఎంత శ్రమించాడో తనకే తెలుసు. 

 

హర్యాణ నుంచి ఒలింపిక్స్‌ వరకు..

తొలిసారిగా విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న సరబ్‌జోత్.. 13  సంవత్సరాల వయసులో షూటింగ్ సాధన చేయడం ప్రారంభించాడు. హర్యానాలోని అంబాలా సమీపంలోని ధేన్‌ గ్రామంలో 2001 సెప్టంబర్‌లో సరబ్‌జోత్‌ జన్మించాడు. సరబ్‌జోత్‌ 2021లో వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌గా నిలిచాడు. గత ఏడాది ఆసియా క్రీడల్లో రెండు పతకాలతోపాటు 2023, 2024లో మూడు ప్రపంచకప్ బంగారు పతకాలను కూడా గెలుచుకున్నాడు. 2023 చాంగ్వాన్ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు మూడ్రోజుల క్రితం జరిగిన విశ్వ క్రీడల 10 మీటర్ల ఎయిర్‌ పిస్తోల్‌ విభాగం ఫైనల్‌ బెర్తును త్రుటిలో చేజార్చుకున్నాడు. అంబాలాలోని ఏఆర్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్‌లో సరబ్‌జోత్‌ శిక్షణ తీసుకున్నాడు. సరబ్‌జిత్ విజయంతో తన స్నేహితుడు ఆదిత్య మల్రా కీలక పాత్ర పోషించాడు. అందుకే ఒలింపిక్స్‌ విజయానికి తన స్నేహితుడు ఎంతో స్ఫూర్తినిచ్చాడని సరబ్‌జోత్‌ తెలిపాడు. గొప్ప ఫుట్‌బాలర్‌ కావాలని కలలుకున్న సరబ్‌జోత్‌… మంచి షూటర్‌ అయి ఇప్పుడు భారత కీర్తి పతకాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై రెపరెపలాడిస్తున్నాడు.

మరిన్ని చూడండి





Source link

Leave a Comment