వంద అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐటీఐ,ఏటీసీలు

By Margam

Published on:

Follow Us
వంద అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐటీఐ,ఏటీసీలు



Telegram Channel Join Now

  • స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి వృత్తి విద్య కళాశాలలు
  • మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణమైన కోర్సులు
  • సిలబస్ మార్పునకు కమిటీ ఏర్పాటు
  • కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న శాఖల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వంద అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రభుత్వ ఐటీఐ,ఏటీసీలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు. వాటిని అడ్వాన్స్​డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి పరుస్తున్నామన్న ఆయన మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణ‌మైన కోర్సుల‌ను ఐటీఐల్లో  ప్రారంభించాల‌ని అధికారులకు సూచించారు. ఆయా కోర్సుల‌కు అవ‌స‌ర‌మైన సిల‌బ‌స్ రూప‌క‌ల్ప‌న‌కు ఓ క‌మిటీని నియ‌మించి, నిపుణులు, విద్యావేత్త‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించాల‌ని ఆదేశించారు. శనివారం రాష్ట్ర సచివాల‌యంలో కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న శాఖ అధికారుల‌తో నిర్వహించిన స‌మీక్షలో సీఎం కీలక అంశాలు వెల్లడించారు.

వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల‌ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా  విధి విధానాలు రూపొందించాలని అధికారుల‌ను ఆదేశించారు. ఐటీఐలను అడ్వాన్స్​డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నందున సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌తి ఐటీఐ క‌ళాశాలల‌కు ప్రిన్సిపాళ్లు ఉండేలా చూడాల‌ని,శిక్ష‌ణ తీసుకుంటున్న వారికి స‌మ‌గ్ర‌మైన శిక్ష‌ణ అందేలా జాగ్ర‌త్త ప‌డాల‌ని సూచించారు.ఐటీఐ క‌ళాశాల‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌,త‌నిఖీలు క్ర‌మం త‌ప్ప‌కుండా చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ఈ స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, కార్మిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సంజ‌య్ కుమార్‌, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డి పాల్గొన్నారు.

Source link

Leave a Comment