రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అనుమానాస్పద బ్యాగ్ …అధికారులు అలర్ట్

By Margam

Published on:

Follow Us
రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అనుమానాస్పద బ్యాగ్ …అధికారులు అలర్ట్



Telegram Channel Join Now

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం సమీపంలో బ్యాగ్ కలకలం సృష్టించింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వివరాలు.. జూబ్లీహిల్స్లోలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అనుమానస్పద స్థితిలో ఓ బ్యాగ్ కనిపించడం కలకలం రేపింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు అనుమానాస్పద బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు.

అనుమానాస్పద బ్యాగ్ను అక్కడి నుంచి అధికారులు తరలించి తనిఖీ చేస్తున్నారు. బాంబు స్క్వాడ్ ఆ బ్యాగ్ను తనిఖీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ బ్యాగ్ ఏముందనేది తెలియాల్సి ఉంది.ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసు స్టేషన్కు సమాచారం అందించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Source link

Leave a Comment