ముద్ర, తెలంగాణ బ్యూరో : బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతోన్నాయి. ఈ క్రమంలో సోమవారం నాడు అల్పపీడనంగా ఏర్పడే అకాశం అన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.
సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.