రాజీనామా కాదు.. రాజకీయ సన్యాసం చేస్తా

By Margam

Published on:

Follow Us
రాజీనామా కాదు.. రాజకీయ సన్యాసం చేస్తా



Telegram Channel Join Now

  • అమృత్​ లో తాను చెప్పింది తప్పని తేలితే దేనికైనా సిద్ధం
  • పొంగులేటీ రాజీనామా అవసరం లేదు
  • సీఎం రేవంత్​ రాజీనామా చేయాల్సి వస్తుంది
  • మంత్రులకు చట్టాలే కాదు.. చుట్టరికాలు కూడా తెలిసినట్లు లేదు
  • ఒక్క రూపాయి అవినీతి జరిగినా ఆఫీస్​ ఆఫ్​ ప్రాఫిట్​ చట్టం కిందకే వస్తుంది
  • పొంగులేటీకి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే దగ్గరకు వెళ్దాం
  • లేదంటే కేంద్రంలోని సెంట్రల్​ విజిలెన్స్​ దగ్గరకు వెళ్దాం
  •  బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమృత పథకంలో తాను ఆరోపించిన విధంగా అవినీతి జరగలేదని తేలితే ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేయడం కాదు….రాజకీయ సన్యాయం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు.  తనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన  ఘాటైనా  కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ను మంత్రి పొంగులేటి  ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఈ విషయంలో ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యమంత్రి రేవంత్ నే రాజీనామా చేయాల్సి వస్తుందని కేటీఆర్  జోస్యం చెప్పారు.

దగుల్బాజీలు…

రాజీనామా చేయాల్సిన దగుల్బాజీలు ఈ ముఖ్యమంత్రి ఆయన మంత్రులే  అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రులకు చట్టాలు మాత్రమే కాదు….. చుట్టరీకాలు కూడా తెలిసినట్టు లేదని ఎద్దేవా చేశారు.భార్య తమ్ముడు బావమరిది కాకుండా ఇంకేమి అవుతాడో పొంగులేటి చెప్పాలన్నారు.ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా నేను ప్రస్తావించిన నేపథ్యంలో పొంగులేటి ఆగమేఘాలమీద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారని అన్నారు. రూ. 1137 కోట్ల రూపాయల అవినీతి జరిగిన, ఒక్క రూపాయి అవినీతి జరిగిన ఈ చట్టం వర్తిస్తుందనే విషయం ఆయన తెలుసుకోవాలని అన్నారు. పొంగులేటికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్దామన్నారు.లేదంటే కేంద్రంలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదా మరి ఏదైనా ఏజెన్సీ దగ్గరకైనా వెళ్దాం అని అన్నారు. గతంలో ఉన్న ఫైల్స్ తో పాటు ఇప్పుడు జరిగిన టెండర్ల వ్యవహారం పైన వివరాలు వారి ముందు ఉంచుదామన్నారు.ఆయన న్యాయంగా తీర్పు చెప్పిన తర్వాత నేను చెప్పింది అబద్ధమంటే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని సవాల్ చేశారు. 

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ టెండర్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రికి, మంత్రి పొంగులేటికి తెలుసు అని అన్నారు. ముఖ్యమంత్రి ఆశ్రిత పక్షపాతం లేకుండా బంధువులకు అక్రమంగా లాభం చేయను అని ప్రమాణ స్వీకారం చేసిన సీఎం  రేవంత్ అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. కేవలం రెండు కోట్ల లాభం ఉన్న  బావమరిది కంపెనీకి రూ. 1000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అవినీతి జరగడం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అని నిలదీశారు. 

ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధుల వ్యవహారాలకు సంబంధించిన అంశంలో  కేంద్ర మంత్రులుకిషన్ రెడ్డి, బండి సంజయ్ నుంచి మొదలుకొని బీజేపీకి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల్లో అవినీతి జరుగుతున్నా వారు ఒక్క మాట కూడా ఎందుకు  మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నానని అన్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అవినీతిపైన మా దగ్గర సమాచారం ఉందన్నారు.  ఈ అవినీతిని వరుసగా బయటపెడతామని కేటీఆర్ హెచ్చరించారు.

Source link

Leave a Comment