మ్యాజిక్ చేసిన HDFC స్కీమ్.. ఏడాదిలోనే పెట్టుబడి డబుల్.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు!

By Margam

Published on:

Follow Us
మ్యాజిక్ చేసిన HDFC స్కీమ్.. ఏడాదిలోనే పెట్టుబడి డబుల్.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు!


Telegram Channel Join Now
HDFC MF Scheme: ఈక్విటీ పెట్టుబడుల్లో రక్షణ రంగంపై ఫోకస్ పెట్టే ఏకైన యాక్టివ్ మ్యూచువల్ ఫండ్‌గా కొనసాగుతున్న హెచ్‌డీఎఫ్‌సీ డిఫెన్స్ ఫండ్ (HDFC Defence Fund) అదరగొట్టింది. ఈ స్కీమ్ లాంచ్ అయిన ఏడాదిలోనే ఇన్వెస్టర్ల డబ్బులను రెట్టింపు చేసింది. ఈ ఫండ్ జూన్, 2023లో లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫండ్ రూ.3,952 కోట్ల మేర పెట్టుబడులను నిర్వహిస్తుండడం గమనార్హం. గత ఆరు నెలల కాలంలో చూసుకుంటే ఈ స్కీమ్ 32.61 శాతం మేర రిటర్న్స్ అందించింది. ఈ పథకం బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ టీఆర్ఐ‌గా ఉంది. ఈ బెంచ్‌ మార్క్ ఇండెక్స్ గత ఏడాదిలో 100.96 శాతం మేర లాభాలు అందించింది. అలాగే గత ఆరు నెలల్లో 46.36 శాతం లాభాలు ఇచ్చింది.గత ఏడాది కాలంలో రక్షణ రంగంలోని కంపెనీల స్టాక్స్ బలంగా రాణిస్తున్నాయి. కొత్త కొత్త ఆర్డర్లు, విదేశాలకు రక్షణ ఉత్పత్తుల ఎగుమతులతో ఈ స్టాక్స్ రాణిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు నిధులను కేటాయిస్తున్న క్రమంలో ఆయా కంపెనీలు మంచి లాభాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలు వస్తున్నాయని చెప్పవచ్చు. మరోవైపు.. ఈ ఏడాది జులైలో మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ లాంచ్ చేశారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఈటీఎఫ్ ఫండ్ లాంచ్ అయ్యాయి.

రూ.10 వేలతో రూ.2.25 లక్షలు..

హెచ్‌డీఎఫ్‌సీ డిఫెన్స్ ఫండ్ జూన్, 2023లో లాంచ్ కాగా అప్పటి నుంచి చూసుకుంటే హైరిటర్న్స్ అందించింది. ఈ స్కీమ్ XIRR 78.65 శాతంగా ఉంది. ఈ స్కీమ్ లాంచ్ అయినప్పటి నుంచి రూ.10 వేల చొప్పున నెలవారీ సిప్ పెట్టుబడి కొనసాగించిన వారికి ఇప్పుడు వారి ఫండ్ విలువ రూ.2.25 లక్షలు అవుతుంది. అలాగే ఈ ఫండ్ CAGR రేటు 85.13 శాతంగా ఉంది. ఇందులో జూన్, 2023లో రూ.1 లక్ష ఒకేసారి లంప్‌సమ్ పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ.2.19 లక్షలు అవుతుంది. అదే రూ.5 లక్షలు పెట్టిన వారికి రూ.10 లక్షలకుపైగా ఫండ్ జమ అవుతుంది. వార్షిక రిటర్న్స్ పరంగా చూసుకుంటే 2023లో ఈ స్కీమ్ 52.05 శాతంగా ఉంది.

అయితే, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్ కలిగి ఉంటాయి. ఇన్వెస్ట్ చేసే ముందే ఎంచుకునే ఫండ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. గతంలో వచ్చిన రిటర్న్స్ భవిష్యత్తులోనూ వస్తాయని చెప్పలేం. కానీ, ప్రస్తుతం చాలా ఫండ్స్ సగటున 12 శాతం వార్షిక రిటర్న్స్ అందిస్తున్నాయి. ఈ లెక్కన మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయలేని వారు, కాస్త రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్న వారు మ్యూచువల్ ఫండ్స్‌ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం డిఫెన్స్ సెక్టార్‌లో ఏకైక యాక్టివ్ ఫండ్‌గా హెచ్‌డీఎఫ్‌సీ స్కీమ్ కొనసాగుతోంది.

Source link

Leave a Comment