మెట్రో రెండో దశకు డీపీఆర్లు​ సిద్ధం

By Margam

Published on:

Follow Us
మెట్రో రెండో దశకు డీపీఆర్లు​ సిద్ధం



Telegram Channel Join Now

  • ఐదు మార్గాల్లో 78.6 కి.మీ. ప్రతిపాదన
  • ఈనెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పణ
  • కేబినెట్ ఆమోదం తర్వాత కేంద్ర ఆమోదానికి
  • మొదటి దశలోని మూడు కారిడార్లకు కొనసాగింపుగా 
  • రెండో ఫేజ్‌లో రూ.24,042 కోట్లతో 60కి పైగా స్టేషన్లు

ముద్ర, తెలంగాణ బ్యూరో : 

హైదరాబాద్​ మెట్రో రైలు రెండో దశ రైలు మార్గం పనులకు సంబంధించి  సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లు సిద్ధమయ్యాయి. ఐదు మార్గాల్లో కలిపి 78.6 కి.మీ.ల మేర పనులకు సంబంధించిన ప్రతిపాదనలు గతంలోనే జరగగా తాజాగా 60కి పైగా స్టేషన్ల కోసం రూ.24,042 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే ఈ మార్గాలపై సీఎం.. అధికారులకు పలుమార్లు కీలక సూచనలు చేశారు. సీఎం ఆదేశాలు, సూచనలతో రెండో దశ డీపీఆర్​లు రెండు వేర్వేరుగా రూపుదిద్దుకున్నాయి. అయితే ఈ రెండు డీపీఆర్​లో సీఎం సూచించిన కొత్త మార్గాలన్నీంటిని అధికారులు పరిగణలోకి తీసుకుని అంచనాలు రూపొందించారు.

రెండో దశలో ప్రతిపాదించిన మార్గాలన్నీ మొదటి దశలోని మూడు కారిడార్లకు కొనసాగింపుగా ఉన్నాయి. తాజాగా సిద్ధమైన రెండు డీపీఆర్​లను ఈనెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశాలున్నాయి. తర్వాత మంత్రిమండలిలో ఆమోదం తెలిపి, వాటిని కేంద్రం అనుమతి కోసం పంపించనున్నారు. కాగా మహానగరానికి ఓఆర్​ఆర్ తర్వాత మణిహారం లాంటి మెట్రో రైలు పనుల్లో వేగం పుంజుకోవడంతో నగర ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. రూపొందించిన డీపీఆర్ల ప్రకారం.. కారిడార్-3కి కొనసాగింపుగా మెట్రోను నాగోల్ నుంచి ఎల్బీనగర్, మైలార్​దేవుపల్లి, జల్​పల్లి, శంషాబాద్ విమానాశ్రయం వరకు 33.1 కిలోమీటర్లను పొడిగిస్తారు. ఈ మార్గంలో 22 స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ కారిడార్​నే మైలార్​దేవుపల్లి నుంచి ఆరాంఘర్, రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ సమీపంలో నిర్మించే కొత్త హైకోర్టు వరకు పొడిగించనున్నారు. మూడు స్టేషన్లలతో దాదాపు 5 కిలోమీటర్లు దూరం ఉండనుంది.

అలాగే ఈ కారిడార్-3కి మరోవైపు రాయదుర్గం నుంచి కాజాగూడ, నానక్ ​రాంగూడ, విప్రో సర్కిల్,ఫైనాన్షియల్ డిస్ట్రిక్, యూఎస్ కాన్సులేట్ మీదుగా కోకాపేట నియో పోలీసు వరకు 11.3 కిలోమీటర్ల వరకు విస్తరించడానికి డీపీఆర్​ ను సిద్ధం చేశారు. అలాగే కారిడార్-1కి కొనసాగింపుగా ఎల్బీనగర్ నుంచి హయత్​ నగర్ వరకు 8 కిలోమీటర్ల మార్గాన్ని పొడిగిస్తారు.మరోవైపు కారిడార్-1కి రెండోవైపు పొడిగింపుగా మియాపూర్ నుంచి పటాన్​ చెరు వరకు 14 కిలోమీటర్లు పొడిగించి, చందానగర్ ప్రాంతంలో కొంతదూరం డబుల్ డెక్​ని ప్రతిపాదించగా, ఈ మార్గంలో 10 స్టేషన్లు రానున్నాయి.  కారిడార్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్​నుమా, చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. పొడిగిస్తారు. ఆరు స్టేషన్లు రానున్నాయి. ఇదీలావుంటే… కేంద్రానికి రెండోదశ డీపీఆర్​లు త్వరగా చేరాలంటే ఫ్యూచర్ ​సిటీని మినహాయించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి 32 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఒకవేళ ఐదు కారిడార్లతో పాటు ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో డీపీఆర్​ ను కూడా కలిపి పంపాలని కేంద్రం కోరితే మెట్రో విస్తరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈరెండు కలిపితే 110 కిలోమీటర్లు అవుతుంది.

Source link

Leave a Comment