దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి మంకీపాక్స్(MonleyPox). ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కూడా అన్ని దేశాలకు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్రికాలోని పలు దేశాల్లో వేలాది మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆసియాలోని పలు దేశాల్లో కూడా అనేక కేసులో నమోదవగా.. భారత్ లో సోమవారం తొలి కేసు నమోదైంది. తాజాగా చైనా(china) మంకీపాక్స్ కు వ్యాక్సిన్ అభివృద్ది చేసింది. చైనాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సినోఫార్మ్ ఈ వ్యాక్సిన్ రూపొందించగా.. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు సిద్దంగా ఉంది. ఇప్పటికే అమెరికా, కెనడా, ఈయూ, జపాన్, రష్యా దేశాల్లో మంకీపాక్స్ టీకా అందుబాటులో ఉండగా.. చైనా నుండి తయారవుతున్న తొలి మంకీపాక్స్ టీకా ఇదే. క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే మరి కొద్ది నెలల్లోనే చైనాలో మంకీపాక్స్ టీకా ప్రజలకు అందుబాటులోకి రానుంది.