- అధికారులు శాఖ గౌరవాన్ని పెంచాలి
- ప్రతి జిల్లాలో క్షేత్ర స్థాయిలో పనితీరు మెరుగుపరుచుకోవాలి
- వారం రోజుల్లో కాటమయ్య రక్షణ కవచం పై శిక్షణ పూర్తి చేయాలి
- ఆదిలాబాద్ జిల్లాలో గురుకుల విద్యార్థులకు యూనిఫాం పంపిణీ ప్రారంభం కాకపోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం సూర్యాపేట, హనుమకొండ జిల్లా అధికారులకు మందలింపు
- వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
ముద్ర, తెలంగాణబ్యూరో :- బీసీ సంక్షేమ శాఖ కుటుంబం లాంటిదని….. అధికారులుశాఖ గౌరవాన్ని మరింతగా పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ మంగళవారం మీడియా కాన్ఫరెన్స్ హల్ లో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. బీసీ సంక్షేమ శాఖ లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. క్షేత్ర స్థాయిలో శాఖ పనితీరు ఏవిధంగా ఉందో అధికారులు నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇవ్వాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామన్నారు. ఇప్పటికే విద్యా శాఖ లో 19 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, 35 వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలు , 11 వేల మంది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి ఫలితాలు విడుదల చేసుకున్నామని వెల్లడించారు. వారికి ఈ నెల 11 న నియామక పత్రాలు అందజేస్తున్న వెల్లడించారు. ఎస్సి,ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో కూడా రిక్యూట్మెంట్ పూర్తయిందని పేర్కొన్నారు. స్టడీ సెంటర్ల ద్వారా నాణ్యమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందన్నారు. అక్కడ గ్రూప్ 1 లో 137 మంది ప్రిలిమ్స్ లో కోచింగ్ తీసుకుంటే 96 మంది మెయిన్స్ కి ఎంపిక అయ్యారని ,574 మంది టీచర్ల కోసం శిక్షణ తీసుకుంటే 30 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.కాగా ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ బృందాన్ని అభినందించారు. గద్వాల్ బీసీ స్టడీ సర్కిల్ పనితీరు బాగాలేదని మెరుగుపరుచుకోవాలని మందలించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ లో మెయిన్స్ కి సెలెక్ట్ అయినా వారికి ఇస్తున్న లక్ష రూపాయల పథకం ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ ద్వారా గతంలోనే బీసీ సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.
ప్రతి ఐఎఎస్ , ఐపిఎస్, ఎమ్మేల్యేు ,బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల లను సందర్శించాలన్నారు.గురుకులాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయో క్షేత్ర స్థాయిలో విద్యార్థి నాయకుడిగా తెలుసనీ , బీసీ సంక్షేమ శాఖ ఇతర డిపార్ట్ మెంట్ లకు రోల్ మోడల్ గా ఉండలని మంత్రి పొన్నం తెలిపారు. ప్రభుత్వ విద్యా,వైద్య సంస్థలు , అంగన్ వాడీలలో ఉపాధి హామీ పథకం ద్వారా వాటి పరిసరాల్లో గడ్డి ,చెత్త తీసేసి పరిశుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారని మంత్రి తెలిపారు. నవంబర్… 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాలు సందర్షిస్తానని పాఠశాల వాతావరణ బాగుండడం తో పాటు మొక్కల పెంపకం, పండ్లు మొక్కల పెంపకం లాంటివి పెంచాలని పేర్కొన్నారు. గత నెలలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముకాటు తో చనిపోయారని అలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడ పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంస్కరణల్లో భాగంగా అన్ని పాఠశాలల్లో ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న దానిలో భాగంగా గురుకులాల్లో కూడా ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామన్నారు. డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో బీసీ అభివృద్ధిలో భాగంగా ఏ సమస్య ఉన్న జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవాలని సూచించారు. ప్రతి గురుకులలో క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి గురుకుల లో ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి విద్యార్థి కొత్తగా ఇన్నోవేట్ చేసేలా వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహాత్మా జ్యోతి రావు పూలే 294 గురుకులాలు ఉన్నాయని అందులో వ్యవసాయ , లా కాలేజి లు ఉన్నాయి. గురుకులాల్లో ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న వాటికి స్థల పరిశీలన చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఆదిలాబాద్ జిల్లాలో యూనిఫాం అందించడంలో విఫలమైన అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ లో జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ,నవంబర్ లో రాష్ట్ర స్థాయి క్రీడలు డిసెంబర్ లో ఆర్ట్స్ అండ్ కల్చరల్ కార్నివాల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా అధికారులతో గురుకులాల్లో ఉన్న మౌలిక వసతులు,అధికారుల పనితీరు పై అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లలో 70,700 మంది ఉన్నారని ముఖ్యంగా హైదరాబాద్ లో అధికంగా ఉన్నారు. వికారాబాద్ లో గత పదవ తరగతి పరీక్షల్లో పనితీరు బాగా లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ లో ఉమ్మడి జిల్లాలో ఉన్న అధికారులను కొత్త జిల్లాలకు కూడా సర్దుబాటు చేయడంతో సిబ్బంది కొరత ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల అయ్యేలా చూడాలని తెలిపారు.. ప్రస్తుతం జయంతి , ,వర్ధంతి కార్యక్రమాలు ప్రత్యేక నిధులు కేటాయించాలని సూచించారు.
వారంలోపు గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం పై శిక్షణ పూర్తి చేయాలనీ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8-9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాటమయ్య రక్షణ కవచం పంపిణీ పూర్తి చేయాలనీ సూచించారు. 7 వ తేది బంజారా భవన్ లో బీసీ సంక్షేమ శాఖ విస్తృత స్థాయి సమావేశంలో కింది స్థాయి హాస్టల్ వార్డెన్ ,గురుకుల ప్రిన్సిపల్ లు , డీబీసీవోస్, ఏబిడివొ, ఆర్సిఓ , డీసీవో లు పాల్గొంటారన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ పథకం అమలు చేస్తుందని దానిని తెలంగాణ కూడా ప్రారంభిస్తే వెనకబడిన తరగతుల వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించి వారికి లోన్ ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు సూచించారు. ప్రధానమంత్రి యంగ్ అచీవ్ మెంట్ స్కాలర్ షిప్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు ఈనెల 31 వరకు అప్లే చేసుకోవచ్చని దీన్ ద్వారా మెరిట్ విద్యార్థులకు తెలంగాణ నుండి 1001 మందికి 9,10 వ తరగతి చదివే వారికి 75 వేలు,11,12 చదివేవారికి లక్షా 25 వేల స్కాలర్ షిప్ అందిస్తున్నట్టు తెలిపారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందనీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, కమిషనర్ బాల మాయాదేవి, గురుకుల సెక్రటరీ సైదులు, సీఈవో అలోక్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు , జాయింట్ డైరెక్టర్ సంధ్య , తిరుపతి, కార్పోరేషన్ ఎండీలు చంద్రశేఖర్ , ఇందిరా , శ్రీనివాస్ రెడ్డి , బీసీ సంక్షేమ శాఖ జిల్లా అభివృద్ధి అధికారులు, బీసీ సంక్షేమ శాఖ జిల్లా సహాయ అధికారులు , స్టడీ సర్కిల్ డైరెక్టర్లు , అర్సివో లు , డీసీవో లు ,ఇతర అధికారులు పాల్గొన్నారు.