ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

By Margam

Published on:

Follow Us
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం



Telegram Channel Join Now

  • ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు రెడ్ కార్నర్ నోటీసు
  • అమెరికాలో తలదాచుకున్న ఇద్దరు కీలక నిందితులు
  • హైదరాబాద్ పోలీసుల నివేదికను సమ్మతించిన సీబీఐ
  • ఇంటర్ పోల్ కు లేఖ
  • రాష్ట్రానికి అప్పగించాలని లేఖలో పేర్కొన్న సీబీఐ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న స్టేట్ ఇంటెలిజెన్సీ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా ఛానల్ ఎండీ అరువెల శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు సమర్పించిన నివేదికను సీబీఐ సమ్మతించింది. హైదరాబాద్ పోలీసులు పంపిన లేఖను సమ్మతించిన సీబీఐ, ఇంటర్ పోల్ కు లేఖ రాసింది. నిందితులిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలంటూ సిఫార్సు చేసింది.  సీబీఐ లేఖను ఇంటర్‌ పోల్ పరిగణనలోకి తీసుకుని నోటీసు జారీ చేస్తే నిందితులిద్దరినీ భారత్‌కు అప్పగించే అవకాశముంది. నిందితులు అమెరికా సహా 196 దేశాల్లో ఎక్కడికి వెళ్లినా అక్కడి పోలీసులు  పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. అనంతరం సీబీఐకి సమాచారమిచ్చి, నిందితులను స్వదేశానికి బలవంతంగా పంపిస్తారు. ఒకవేళ రెడ్ కార్నర్ నోటీసుతో నిందితులు విభేదిస్తే, వారు ఏ దేశంలో ఉంటే అక్కడి కోర్టును ఆశ్రయించవచ్చు. అక్కడ కూడా ఊరట లభించకపోతే డిపోర్టేరేషన్ తప్పదు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవసాహరం నడిచిందని ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ డీసీపీ రాధకిషన్ రావు, మాజీ ఎఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల నుంచి మరిన్న ఆధారాలను పోలీసులు సేకరించారు. ఎస్ఐబీ మాజీ ఛీప్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాము ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు వారంతా పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. దీంతో ఈ కేసులో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను రెడ్ కార్నర్ నోటీసుల ద్వారా రాష్ట్రానికి రప్పించి,  విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

Source link

Leave a Comment