పప్పులో జెర్రి ప్రత్యక్షం.. పేమస్ హోటల్‌‌లో ఘటన.. సిబ్బంది రెస్పాన్స్‌తో కస్టమర్ షాక్..!

By Margam

Published on:

Follow Us
పప్పులో జెర్రి ప్రత్యక్షం.. పేమస్ హోటల్‌‌లో ఘటన.. సిబ్బంది రెస్పాన్స్‌తో కస్టమర్ షాక్..!


Telegram Channel Join Now
హైదరాబాద్‌లో తిండి తినాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికే.. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన వరుస దాడులతో చిన్న చిన్న హోటళ్ల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు అన్నింటి భాగోతం బయటపడింది. దీంతో.. బయట భోజనం చేయాలంటే జంకుతున్నారు. బయట తినాల్సిన సందర్భం వస్తే.. మంచి పేరు ఉన్న హోటళ్లు, నమ్మకం ఉన్న రెస్టారెంట్లను మాత్రమే ఎంచుకుంటున్నారు. అయితే.. అలాంటి ఫేమస్ హోటళ్లకు వెళ్లాలంటే కూడా ఆలోచించాల్సిన సంఘటనలు ఎదురవుతున్నాయి. అచ్చంగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది తాజ్ మహల్ హోటల్‌లో. ఓ కస్టమర్ తింటున్న భోజనంలో పప్పులో జెర్రి రావటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న అబిడ్స్‌లోని ఫేమస్ తాజ్‌మహల్‌ హోటల్‌‌లో ఈ ఘటన జరిగింది. తాజ్ మహల్ హోటల్‌కు వెళ్లిన ఓ కస్టమర్ వెజ్ తాలి ఆర్డర్ చేశాడు. భోజనం చేస్తున్న క్రమంలో.. పప్పు కూడా తిన్నాడు. అయితే.. పప్పు గిన్నె అడుగులో జెర్రి కనిపించటంతో.. హతాశుడయ్యాయి. భోజనం సగం అయిపోయింది.. ఎక్కువశాతం పప్పుతోనే తిన్నాడు.. చివరికి జెర్రి కనిపించటంతో.. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదే విషయాన్ని హోటల్ సిబ్బందికి తెలిపాడు. కాగా.. ఆ సిబ్బంది రెస్పాన్స్ చూసి కస్టమర్ షాక్ అయ్యాడు.

పప్పులో జెర్రి వచ్చిందని చెప్తే.. అది పాలకూర పప్పు కదా.. పాలకూర వల్ల వచ్చి ఉంటుందని నిర్లక్ష్యమైన సమాధానం చెప్పాటంతో.. కస్టమర్‌కు ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. ఓవైపు.. పప్పులో జెర్రి వచ్చిందని చెప్తుంటే.. మరోవైపు ఆర్డర్లు తీసుకుంటూ.. టోకెన్లు ఇస్తూ.. బోజనంలో అదే పప్పును సప్లై చేస్తూనే ఉన్నారు. దీంతో.. బాధిత కస్టమర్ మిగతా కస్టమర్లకు జరిగిన విషయం చెప్పి.. ఎవరూ తినొద్దని హెచ్చరించటంతో.. వాళ్లంతా తినకుండా జాగ్రత్త పడ్డారు.

దానికి కూడా.. సిబ్బంది వెరైటీ సమాధానం ఇచ్చారు. ఆ పప్పు పక్కన పడేశామని.. వేరే పప్పు రెడీ చేపించి ఇస్తున్నామని.. ప్రాబ్లం ఏమీ లేదంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో.. మరి అప్పటికే తిన్న కస్టమర్లు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటంటూ సిబ్బందిని నిలదీశారు. కాగా.. ఆ బాధిత కస్టమర్ వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి.. పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. తాము చాలా ఏళ్లుగా ఆ హోటల్‌కి వెళ్తున్నామని.. ఎప్పుడూ ఇలాంటి సంఘటన ఎదురుకాలేదని.. చాలా మంచి భోజనం పెడతారని.. కానీ ఈసారే ఇలా జరిగిందని చాలా హుందాగా చెప్పుకొచ్చారు.

అయితే.. ఇప్పటికే బిర్యానీలో బొద్దింక.. సాంబార్‌లో బల్లి.. ఇలా రకారకాలా జీవాల అవశేషాలన్ని భోజనంలో వస్తుంటే.. హోటళ్లకు వెళ్లాలంటేనే వెగటు వస్తోంది. అందులోనూ.. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి మంచి పేరున్న తాజ్ మహల్ హోటల్‌లో.. ఇలాంటి ఘటన జరగటం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. మరి.. ఇలాంటివన్నీ చూస్తూ.. జనాలు హోటళ్లలో భోజనాలు ఎలా చేస్తారో అర్థం కావట్లేదు.. ఒకవేళ తిన్నా.. జర చూసుకోని తిని విలువైన ఆరోగ్యాలు కాపాడుకోవాలని.. పలువురు సూచిస్తున్నారు.

Source link

Leave a Comment