పండుగపూట గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టమోటా ధరలు

By Margam

Published on:

Follow Us
పండుగపూట గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టమోటా ధరలు


Telegram Channel Join Now

దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ వేళ సామాన్యులకు గుడ్ న్యూస్ లభించింది. టామోటా ధరలు భారీగా తగ్గాయి. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్‌లో కిలో టామోటా ధర రూ.20కి పడిపోయింది. మూడు రోజుల క్రితం రూ.100 పలికిన టామోటా.. ఏకంగా 80 రూపాయలు తగ్గి.. రూ.20 లకు పడిపోయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టామోటా ధరలు ఇప్పుడే కాదు.. గతంలో కూడా చాలా ఇబ్బందికరమైన పంటగా మారుతోంది. దాదాపు ఏడాదిలో 4, 5 సార్లు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలకి ఎక్కువగా వాతావరణ పరిస్థితులే కారణమని అధికారులు చెబుతున్నారు.



Source link

Leave a Comment