ఏపీ నూతన మద్యం పాలసీకి కేబినెట్ ఆమోద ముద్రవేసింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం…కొత్త మద్యం పాలసీపై సుదీర్ఘంగా చర్చించింది. ఎన్నికల హామీ మేరకు నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ స్పష్టంచేసింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. వాలంటీర్ల వ్యవస్థపైనా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.#AndhraPradesh pic.twitter.com/EV4MKURG6T
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 18, 2024