- స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :పిల్లలకు విద్యా బుద్దులు చెప్పాల్సిన ఓ గురువు బుద్ది వక్రమార్గం పట్టింది. పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ తన కామకోర్కేలను తీర్చుకోవాలనుకున్నాడు. అభం శుభం తెలియని చిన్నారులు అతగాడి చేష్టలను భరించలేక తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు కీచక టీచర్ కు బడిత పూజ చేసి స్కూల్ యాజమాన్యానికి అప్పగించిన సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే కరీంనగర్ పట్టణంలోని బ్రహ్మనవీధిలో గల నారాయణ స్కూల్ లో సోషల్ టీచర్ శ్రీనివాస్ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినులను చెప్పుకోలేని ప్రదేశాల్లో తాకుతు తన కామవాంచను తీర్చుకునే ప్రయత్నం చేశాడు. సదరు ఉపాధ్యాయుడి చేష్టలతో విసిగిపోయిన పిల్లలు సదరు కీచక టీచర్ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో పిల్లల తల్లిదండ్రులు స్కూల్ కు చేరుకుని సదరు ఉపాద్యాయుడిని చితకబాదడంతో ఉపాధ్యాయుడు అక్కడినుండి ఉడాయించాడు. కీచక టీచర్ పారిపోవడంతో ఆగ్రహించిన పేరెంట్స్ స్కూల్ పర్నిచర్ ద్వంసం చేసి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితులను శాంతింపజేసి సదరు ఉపాద్యాడిని చట్టపరంగా శిక్షిస్తామని హమీ ఇవ్వడంతో గోడవ సద్దుమణిగింది. పూర్తిగా విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.