వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శ్రీలీల ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై శ్రీలీల స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రేమ, పెళ్లి వార్తలపై శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని చెప్పింది.
‘చదువు మధ్యలో సినిమా రంగంలో అడుగుపెట్టాను. ఇప్పుడు మళ్లీ చదువుపైనా దృష్టి పెట్టాను. మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయాలని భావిస్తున్నాను. అందుకే ఎక్కువ సినిమాలకూ కమిట్ అవ్వడం లేదు. ప్రస్తుతం చదువు, నటనపై కాకుండా కనీసం నా వ్యక్తిగత విషయాలపైనా శ్రద్ధ పెట్టలేక పోతున్నాను’ అని శ్రీలీల చెప్పుకొచ్చింది.
తన వ్యక్తిగత విషయాలపై కొన్నాళ్ల తర్వాతే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రస్తుతం తాను భావిస్తున్నట్లు శ్రీలీల చెప్పింది. ప్రస్తుతానికి ఆ సమయం నా వద్ద లేదని, భవిష్యత్తులో చదువు పూర్తైన తర్వాత వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ పెడతానంటూ చెప్పుకొచ్చింది.
శ్రీలీల తెలుగు సినిమాలతో పాటు, తమిళ సినిమాల నుంచి ఆఫర్లు సొంతం చేసుకుంటుంది. కానీ ప్రస్తుతానికి తమిళ సినిమాలను సున్నితంగా తిరస్కరిస్తూ తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తోంది. హీరోయిన్‌గా శ్రీలీల గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది కాస్త స్లో అయింది. కానీ, ముందు ముందు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో శ్రీలీల సినిమాలు చేస్తుందా..? వేచి చూడాలి.