గ్రామస్తుల కోసం ఒక్కో కూపన్ ధర రూ.100గా నిర్ణయించారు. అక్టోబర్ 12న దసరా పండగా కాగా.. అక్టోబర్ 10న సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీయనున్నారు. అయితే.. ఈ స్కీంలో ఐదురుగు విజేతలను ఎంపిక చేయనున్నారు. ఈ ఐదుగురికి అదిరిపోయే బహుమతులను కూడా ఇవ్వనున్నారు. మొదటి విజేతకు బహుమతిగా 10 కిలోల మేకను ఇవ్వనున్నట్టు ప్రకటించగా.. రెండో బహుమతిగా 2 బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిళ్లు ఇవ్వనున్నారు. ఇక.. మూడో బహుమతిగా కాటన్ బీర్లు, నాలుగో బహుమతిగా 2 నాటు కోళ్లు, ఐదో బహుమతిగా ఒక రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ అందించనున్నట్లు ఆ బ్యానర్‌లో ఉంది.
అయితే.. త్వరలోనే ఈ స్కీంకు సంబంధించిన కూపన్‌లను గ్రామస్తులకు అందుబాటులో ఉంచనున్నట్టు చెప్తున్నారు. బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసే కార్యక్రమంలో చిన్న పిల్లతోనే లక్కీ డ్రా తీసి విజేతలకు ప్రకటిస్తామని బ్యానర్‌లో స్పష్టం చేశారు. అంతేకాదు.. ఈ స్కీం నిర్వహకుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను కూడా బ్యానర్ మీద ప్రింట్ చేశారు. కాగా.. వెల్మకన్నె యువకులు ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యువకులు ప్రకటించిన ఈ వినూత్నమైన స్కీం మీద సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో లక్కీ డ్రా పేరుతో చాలా స్కీంలు పెట్టారు.. కానీ ఇలాంటిది ఇదే మొదటిసారి అని కొందరు కామెంట్లు చేస్తే.. ఇప్పటివరకు స్కీంలలో బైకులు, ప్రెజర్ కుక్కర్లు, ఇంట్లో వాడుకునే వంట సామాన్లను గిఫ్టులుగా ఇచ్చేవారు. కానీ.. ఈసారి దసరాకు మాత్రం చుక్కా, ముక్కా అంటూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు వెల్మకన్నె గ్రామ యువకులు.