తేజ ‘హనుమంతు’.. సరైన టైం కోసం వెయిటింగ్‌

By Margam

Published on:

Follow Us
తేజ ‘హనుమంతు’.. సరైన టైం కోసం వెయిటింగ్‌


Telegram Channel Join Now
టాలీవుడ్ లో ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘జయం’ సినిమాలు ట్రెండ్‌ సెట్‌ చేశాయి అనడంలో సందేహం లేదు. అలాంటి ట్రెండ్‌ సెట్టర్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ తేజ. 2000 సంవత్సరంలో తేజ సినీ ప్రస్థానం దర్శకుడిగా ప్రారంభం అయింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా కొత్త తరహా ప్రేమ కథలను చూపించడం లో సక్సెస్ అయ్యాడు. చిత్రం సినిమా తర్వాత ఒక్కసారిగా స్టార్స్ సైతం తేజ వైపు చూశారు. అయితే తేజ ప్రేమ కథలు, అందులోనూ కొత్త వారితో చేస్తేనే హిట్‌ కొడతాడు అనే అభిప్రాయం పడిపోయింది. కొన్ని సినిమాలు పెద్ద హీరోలతో చేసినా అవి బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచయం చేసిన తేజ గత ఏడాది సైతం దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్‌ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న హీరోల్లో నితిన్‌, నవదీప్‌, అభిరామ్‌ లను ఇంకా పలువురు కమెడియన్స్ ను తేజ పరిచయం చేయడం జరిగింది. దివంగత హీరో ఉదయ్ కిరణ్‌ నూ తేజ ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఉదయ్‌ కిరణ్ తో తేజకి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ సంబంధాలతోనే ఉదయ్ కిరణ్‌ బయోపిక్ ను తీస్తానంటూ ఆ మధ్య ప్రకటించాడు. తేజ మరికొన్ని సినిమాలనూ ప్రకటించాడు కానీ అన్నింటి కంటే ముందు తన వారసుడు సినిమాను తీసేందుకు రెడీ అవుతున్నాడు.

తేజ ఇప్పటి వరకు పలువురు నటీ నటులను పరిచయం చేశాడు. ఇప్పుడు తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే తన వారసుడి కోసం ‘హనుమంతు’ అనే విభిన్నమైన టైటిల్‌ ను ఖరారు చేయడం జరిగిందట. కథ వర్క్ దాదాపుగా పూర్తి అయిందని, పీరియాడిక్‌ డ్రామాగా, ఫాంటసీ ఎలిమెంట్స్ తో సినిమా ఉంటుందని తేజ సన్నిహితులు అంటున్నారు. ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొడుకు సినిమాను తీయబోతున్నాడట. తేజ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలోనూ విభిన్నమైన ప్రేమ కథను చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అతి త్వరలోనే ఈ కాంబో కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

దర్శకుడు తేజకి ఆంజనేయుడు అంటే సెంటిమెంట్‌. జయం సినిమాలో నితిన్‌ చేతిలో ఆంజనేయుడు జెండా పెట్టి ఫైట్‌ చేయించిన విషయం తెల్సిందే. ఇంకా ఆయన పలు సినిమాల్లో ఏదో ఒక చోట ఆంజనేయుడు రిఫరెన్స్ ఉంటుంది. కనుక కొడుకు సినిమా కోసం తన సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో ‘హనుమంతు’ అనే టైటిల్ ను పెట్టి ఉంటాడు. లవ్‌ స్టోరీ సినిమా తో తేజ హిట్‌ కొట్టి దాదాపు 20 ఏళ్లు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ లవ్‌ స్టోరీని ఆయన ఎంపిక చేసుకోవడం కరెక్టేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొడుకు కోసం తేజ కాస్త ఎక్కువగానే గ్రౌండ్‌ వర్క్ చేసి స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట. కనుక తేజకు చిత్రం, జయం వంటి హిట్‌ హనుమంతు తో దక్కేనా చూడాలి.

Source link

Leave a Comment