తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం

By Margam

Published on:

Follow Us
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం



Telegram Channel Join Now

  • తెలంగాణకు రూ. 416 కోట్లు
  • ఏపీకి 1036 కోట్లు
  • ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ నిధులు
  • కేంద్ర బృందాల పూర్తి నివేదిక తర్వాత మరిన్ని నిధులు
  • ప్రకటించిన కేంద్ర హోం శాఖ

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మొత్తం 14 రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్ల నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫండ్ ​(ఎస్​డీఆర్​ఎఫ్​), నేషనల్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫండ్​(ఎస్​డీఆర్​ఎఫ్​) అడ్వాన్సు నుంచి ఈ నిధులను మంజూరు చేసింది.  తెలంగాణకు రూ.416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లను విడుదల చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,432 కోట్లను ఇచ్చింది. గుజరాత్‌కు రూ.600 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లను కేటాయించింది. రాష్ట్ర విపత్తు నిధికి ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్రం వాటాగా ఈ మేరకు నిధులను విడుదల చేసింది. ఇటీవల భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కేరళ సహా వరద ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి. వరదల వల్ల ఆయా రాష్ట్రాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ నివేదిక ఇచ్చాయి. దీంతో తక్షణ సాయంగా కేంద్ర హోంశాఖ నిధులను మంజూరు చేసింది.

రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో పాటు, కేంద్ర బృందం పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసి రూ. 10 వేల కోట్లు నష్టపోయినట్లు నివేదికలు ఇచ్చింది. అయితే, ఆయా నష్టాలను అంచనా వేసిన కేంద్రం.. తక్షణ సాయంగా ఈ నిధులు కేటాయించింది. కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేస్తామని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. 

మంగళవారం రాత్రి మొత్తం 14 రాష్ట్రాలకు వరద సాయం విడుదల చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో అస్సాంకు రూ. 716 కోట్లు, బిహార్​కు రూ. 655.60 కోట్లు, గుజరాత్​కు 60‌‌0 కోట్లు, హిమాచల్​ ప్రదేశ్​కు 189.20 కోట్లు, కేరళకు రూ. 145.60 కోట్లు, మణిపూర్​కు 50 కోట్లు, మిజోరంకు 21.60 కోట్లు, నాగాలాండ్​కు రూ. 19.20 కోట్లు, సిక్కింకు 23.60 కోట్లు, త్రిపురకు 25 కోట్లు, పశ్చిమ బెంగాల్​కు 468 కోట్లు కేటాయించారు.

Source link

Leave a Comment