తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట చరిత్ర కమ్యూనిస్టులదే

By Margam

Published on:

Follow Us
తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట చరిత్ర కమ్యూనిస్టులదే



Telegram Channel Join Now

  • ప్రజలతో మమేకమై ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం
  • సాయుద తెలంగాణ పోరాట వార్షికోత్సవ సభలో cpm జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్

ముద్ర,పానుగల్ :- తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట చరిత్ర కమ్యూనిస్టులదేనని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బర్ అన్నారు. మంగళవారం తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భంగా పానుగల్ మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.తెలంగాణ రైతాంగ పోరాటం భూమి భుక్తి వెట్టిచాకిరి విముక్తికి నైజాం నిరంకుశ పాలనకు దేస్ముకులు జాగిర్ధార్లు జమీందార్లు పటేల్ పట్వారీలు దొరల దోపిడీకి వ్యతిరేకంగా 1946 నుంచి 1951 వరకు ఐదు ఏండ్లు సాయుధ పోరాటము సాగిందన్నారు పోరాటానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించరాన్నారు.

నాడు ఆర్ఎస్ఎస్, బిజెపి, ఆర్య సమాజ్ ఏ ఒక్కరు నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడలేదు అని అన్నారు. ఆనాడు భూస్వాములు దొరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం బిజెపి వారు ముస్లింలకు హిందువులకు మధ్య జరిగిన ఘర్షణ గా చిత్రీకరించి వక్రీకరణ చేస్తున్నారని అన్నారు.సాయుధ పోరాటములో అన్ని కులాల మతాల వారు పాల్గొని తిరుగుబాటు చేశారని అన్నారు. భూస్వాముల రజాకార్ల దాడిలో 1500 మంది కమ్యూనిస్టులు మరణించారని sep 17 తర్వాత 1951 వరకు నెహ్రూ సైన్యం సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో దాడిలో 2500 కమ్యూనిస్టులు మరణించి అమరులయ్యారన్నారు.గ్రామాల్లో గ్రామ రాజ్యాలు నిర్మించుకొని భూస్వాములను పట్టానాలకు తరిమికొట్టారని , విమోచనం విద్రోహము కాదనీ 1948 sep 17 నాటికి నిజాం లొంగిపోయి బారతదేశంలో విలీనం చేశారని కాబట్టి విలీన దినమని అన్నారు.భూస్వాములు ఖద్దర్ టోపీలు పెట్టుకుని మళ్ళీ పేదల భూములు గుంజుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారని రాబోయే కాలంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం అని అన్నారు. అనంతరం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  సిపిఎం నాయకులు భగత్,వెంకటయ్య,మల్లేష్ ,ఖాజా,చంద్ర శేఖర్ , వెంకటయ్య ,నిరంజన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Source link

Leave a Comment