తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

By Margam

Published on:

Follow Us
తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు



Telegram Channel Join Now

తిరుమల శ్రీవారి లడ్డూ గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను అపవిత్రం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తిరుమలలో దుర్మార్గంగా వ్యవహరించిందన్న చంద్రబాబు.. భక్తులకు నాసిరకం లడ్డూలు, నాణ్యతలేని అన్నప్రసాదం పంపిణీ చేసిందంటూ ఆరోపించారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామని చెప్పుకొచ్చారు.

అయితే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూపై సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఎలాంటి స్పందనలు వస్తాయనేదీ చూడాల్సి ఉంది. మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ధర్మారెడ్డి స్థానంలో జె. శ్యామలరావును నియమించింది. ఇక ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భక్తులు సౌకర్యాలు, ప్రసాదాల నాణ్యతపై ఈవో స్పెషల్ ఫోకస్ పెట్టారు. శ్రీవారి లడ్డూ నాణ్యత తగ్గడానికి నెయ్యే కారణమని గుర్తించిన ఈవో.. నెయ్యి సరఫరా చేస్తున్న కొన్ని సంస్థలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించి లడ్డూలు తయారు చేయిస్తున్నారు.



Source link

Leave a Comment