Telegram Channel
Join Now
తిరుమలలో టీటీడీ మహాశాంతి హోమం ముగిసింది.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు హోమం, సంప్రోక్షణ చేశారు. హోమం అనంతరం టీటీడీ ఈవో జే శ్యామలరావు, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు కీలక ప్రకటన చేశారు. హోమం తర్వాత భక్తులకు తిరుమల లడ్డూ ప్రసాదంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. వాస్తవానికి తిరుమల పవిత్రోత్సవాల కంటే ముందే తిరుమల లడ్డూ ప్రసాదాల్లో ఉపయోగించే నెయ్యిని మార్చేసినట్లు తెలిపారు.