టేబుల్‌ టెన్నిస్‌లో సంచలనం.. ప్రీక్వార్టర్‌లోకి మనిక బాత్రా

By Margam

Published on:

Follow Us
టేబుల్‌ టెన్నిస్‌లో సంచలనం.. ప్రీక్వార్టర్‌లోకి మనిక బాత్రా


Telegram Channel Join Now
పారిస్ ఒలింపిక్స్‌ 2024 భారత టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ మనిక బాత్రా చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గెలిచి పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లోకి ప్రవేశించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఈ ఒలింపిక్స్‌లో ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరుగుతుండగా.. అదే దేశానికి చెందిన క్రీడాకారిణిపై మనిక విజయం సాధించింది.మొత్తంగా 37 నిమిషాల పాటు ఈ గేమ్‌ సాగింది. కామన్వెల్త్‌ ఛాంపియన్‌ అయిన మనిక బాత్రా.. ఈ మ్యాచ్‌లో తనకంటే మెరుగైన ర్యాంక్‌ అంటే 12వ సీడ్‌లో ఉన్న ఫ్రాన్స్‌కు చెందిన ప్రీతిక పవాడేతో తలపడింది. అయితే వరుస గేమ్‌లలో మనిక విజయం సాధించింది. 11-9,11-6,11-9,11-7 తేడాతో గెలుపొందింది.

తొలి గేమ్‌ పోటాపోటీగా సాగగా.. రెండో గేమ్‌ సైతం ఉత్కంఠభరితంగా సాగింది. ఓ దశలో 6-6తో టై అయింది. ఈ దశలో భారత ప్లేయర్‌ సత్తాచాటింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 11-6 తేడాతో గేమ్‌ను ముగించింది. మూడో గేమ్‌లో ఓ దశలో మనిక ఐదు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఫ్రాన్స్‌కు చెందిన ప్రీతిక వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. కానీ ఆఖర్లో అదరగొట్టిన మనిక.. ఆ గేమ్‌ను సైతం గెలుచుకుంది. చివరి గేమ్‌ను 11-7తో సొంతం చేసుకుని.. పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లోకి ప్రవేశించింది.

ఇక ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో మనిక ప్రత్యర్థి ఎవరు అనేది తేలాల్సి ఉంది. జపాన్‌కు చెందిన ఎనిమిదో సీడ్ హిరోనో మియు, హాంకాంగ్‌కు చెందిన ఝు చెంగ్‌జుల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో మనిక బాత్రా అమీతుమీ తేల్చుకోనుంది.

ఇక పారిస్ ఒలింపిక్స్‌ 2024లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లోకి ప్రవేశించడంపై మనిక బాత్రా సంతోషం వ్యక్తం చేసింది. మ్యాచ్‌ తర్వాత మాట్లాడిన ఆమె.. పారిస్‌ గడ్డపై ఫ్రెంచ్‌ ప్లేయర్‌ను ఓడించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ర్యాంకింగ్‌ పరంగా తనకంటే మెరుగైన ప్లేయర్‌పై విజయం సాధించడం ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొంది.



Source link

Leave a Comment