టీటీడీలో మరో సంచలనం.. ఐటీ విభాగం మాజీ జీఎం సందీప్‌రెడ్డికి నోటీసులు, వారం డెడ్‌లైన్

By Margam

Published on:

Follow Us
టీటీడీలో మరో సంచలనం.. ఐటీ విభాగం మాజీ జీఎం సందీప్‌రెడ్డికి నోటీసులు, వారం డెడ్‌లైన్


Telegram Channel Join Now
టీటీడీ ఐటీ విభాగం జీఎంకు నోటీసులు వ్యవహారం చర్చనీయాంశమైంది. వైఎస్సార్‌సీపీ హయాంలో టీటీడీ ఐటీ విభాగం జీఎంగా సందీప్‌రెడ్డి నియమితులయ్యారు. గత టీటీడీ ఛైర్మన్‌లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో సందీప్‌రెడ్డి ఐటీ విభాగంలో విధులు నిర్వహించారు. ఆయన్ను మొదట సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడిగా నియమించగా.. ఆరు నెలలకే చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఆ తర్వాత సందీప్‌రెడ్డిని ఐటీ విభాగం జీఎంగా నియమించారు. గతంలో ఇలాంటి పోస్టు లేదని చెబుతున్నారు. ఆ పోస్టును సృష్టించి నియామకానికి ఇంటర్వ్యూ నిర్వహించారు.ఆ తర్వాత సందీప్‌రెడ్డిని ప్రొబేషనరీ అధికారిగా నియమించి.. అనంతరం ఇంఛార్జ్‌ జీఎంగా బాధ్యతలు అప్పగించారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆయనను జీఎం పోస్టు నుంచి తప్పించారు.. స్విమ్స్, బర్డ్‌ సాంకేతిక నిపుణుడిగా బదిలీ చేశారు. అయితే తన విద్యార్హతలు, ఎక్స్‌పీరియన్స్, టీటీడీకి ఎంపికైన విధానంపై సంజాయిషీ ఇవ్వాలని టీటీడీ నియామక విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి ఈ నెల 4న సందీప్‌రెడ్డికి నోటీసులు జారీ చేసి.. వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే సందీప్‌ రెడ్డికి జారీ చేసిన నోటీసుల వ్యవహారం ఆలస్యంగా బయటపడింది.

ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.. వచ్చీ రాగానే తిరుమల నుంచి ప్రక్షాళన మొదలుపెట్టింది. టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలరావును నియమించారు.. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రక్షాళన మొదలుపెట్టారు. ముందుగా అన్నప్రసాదం, ఆ తర్వాత లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచే పనిలో ఉన్నారు. అలాగే శ్రీవారి భక్తుల దర్శనాలు, వసతి సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే భక్తులు ఆధార్ ద్వారా సేవలు పొందేలా వ్యవస్థను రూపొందించే పనిలో ఉన్నారు. అదే జరిగితే తిరుమలలో దళారులకు అడ్డుకట్ట వేయొచ్చని.. ఎక్కడా అక్రమాలకు అవకాశం ఉండదు అంటున్నారు. ఇటు దివ్య దర్శన టికెట్లను పెంచుతామని చెబుతున్నారు.

Source link

Leave a Comment