దిశ, వెబ్ డెస్క్ : ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్ జొమాటో(Zomato) కో ఫౌండర్, సీపీవో ఆకృతి చోప్రా(Akriti Chopra) రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆకృతి రాజీనామా చేశారని, తక్షణమే ఆకృతి రాజీనామా అమల్లోకి వస్తుందని జొమాటో స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో పేర్కొంది. ఆకృతి చోప్రా 2011 నుంచి జొమాటోలో తన ప్రయాణాన్ని కొనసాగించారు. దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు ఈరోజుతో ఆకృతి ఫుల్ స్టాప్ పెట్టేసింది. సంస్థ యొక్క ఫైనాన్స్, ఆపరేషన్స్ లో సీనియర్ మేనేజర్ గా కెరీర్ ప్రారంభించి.. తర్వాత చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ గా, చీఫ్ పీపుల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. జొమాటో గ్రోసరీ డెలివరీ విభాగమైన బ్లింకిట్(BlinkIt) సీఈఓ ఆల్బిందర్ దిండ్సాను వివాహం చేసుకున్నారు. అయితే గతంలోనూ వివిధ సందర్భాల్లో ఇప్పటికే నలుగురు కో ఫౌండర్స్ సంస్థను వీడగా.. ఆకృతి ఐదో కో ఫౌండర్.