దిశ,వెబ్‌డెస్క్: టెలికాం రంగంలో రిలయన్స్ జియో(Reliance Jio) ఓ సంచలనం. అనతికాలంలోనే కోట్లాది మంది యూజర్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఫ్రీగా సిమ్ కార్డులు అందించడమే కాకుండా ఫ్రీగా డేటా(Data for free), అన్ లిమిటెడ్ కాల్స్(Unlimited calls) ఇస్తూ మిగతా కంపెనీలకు గట్టి పోటినిచ్చిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలో రీఛార్జ్‌ను పెంచిన తర్వాత జియో కస్టమర్లు నిరాశ చెందారు. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలతో జియో నుంచి చాలా మంది తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్(Recharge Plans) అందిస్తున్న BSNLకు మారారు.
ఈ నేపథ్యంలో జియో కస్టమర్లకు(Jio customers) గుడ్ న్యూస్ చెప్పింది. దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 98 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ 5జీ డాటా, కాలింగ్‌తో కూడిన రూ.999 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీర్ఘకాలికంగా డేటా, కాలింగ్‌ను కోరుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నయా ప్లాన్‌ను తీసుకొచ్చింది సంస్థ. ఈ ప్లాన్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు వర్తించనున్నది. దీంతోపాటు రోజుకు 100 SMS, దేశవ్యాప్తంగా రోమింగ్ ఫ్రీ, జియో క్లౌడ్(Jio Cloud), జియో సినిమా(Jio movie), జియో టీవీలను(Jio TV) ఉచితంగా అందిస్తోంది.