జానీ మాస్టర్‌కు పోలీసుల నోటీసులు.. పరారీలో జానీ…!

By Margam

Published on:

Follow Us
జానీ మాస్టర్‌కు పోలీసుల నోటీసులు.. పరారీలో జానీ…!



Telegram Channel Join Now

డ్యాన్సర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌పై ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద కేసులు నమోదైన తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నార్సింగి పోలీసులు బాధితురాలి నుంచి ఇప్పటికే స్టేట్‌ మెంట్ కూడా తీసుకున్నారు. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోలీసులు జానీ మాస్టర్‌ కోసం గాలింపు ముమ్మరం చేశారు.

జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడన్న సమాచారంతో అక్కడి పోలీసులతో నార్సింగి పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. పోలీసులు జానీ మాస్టర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరిన్ని ఆధారాలు సేకరించడంలో భాగంగా పోలీసులు ఇవాళ బాధితురాలి ఇంటికి మరోసారి వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే నార్సింగి పోలీసులు బాధితురాలి ఇంట్లోనే 3 గంటల పాటు విచారించి వివరాలు సేకరించగా.. జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన విషయాలు బయట పెట్టింది. జానీ మాస్టర్‌తనపై అత్యాచారం చేసి దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. షూటింగ్‌ టైంలో క్యారవాన్‌లో బలవంతం చేశాడు. సెక్స్‌ కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడని..తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు  పేర్కొంది.జానీ మాస్టర్‌ ముంబైతోపాటు హైదరాబాద్‌లో కూడా తనపై లైంగిక దాడి చేశాడని. పెళ్లి చేసుకోవాలని నాపై ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.

Source link

Leave a Comment