Telegram Channel
Join Now
విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జాతీయ రహదారి పక్కన కొయ్యలగూడెం వద్ద ఖమ్మం నుంచి మియాపూర్ వైపు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 11 మందికి గాయాలు అయ్యాయి.