చెరువులో కలుస్తున్న కలుషితనీరు

By Margam

Published on:

Follow Us
చెరువులో కలుస్తున్న కలుషితనీరు


Telegram Channel Join Now

  • పాడవుతున్న పంట పొలాలు
  • రోగాల బారిన పశువులు

ముద్ర/వీపనగండ్ల :- బాయిలర్ మిల్లు నుంచి వస్తున్న కలుషిత నీరు చెరువుల చేరడంతో వాటి కింద ఉన్న పచ్చడి పంట పొలాలు, చెరువు నీటిని తాగుతున్న పశువులు, గొర్రెలు రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. గ్రామస్తుల కథన ప్రకారం పుల్గర్ చర్ల గ్రామ సమీపంలోని కొత్తచెరువు లోకి శ్రీరంగాపురం మండలం నాగరాల సమీపంలో గల ఆల్ ఆజీజ్ ఆగ్రో ఇండస్ట్రీస్( బాయిలర్ రైస్ మిల్) నుంచి వచ్చే కలుషిత నీరు కొత్తచెరువు లోకి చేరడంతో నీళ్లు కలుషితమై గ్రామంలోకి దుర్వాసన వెదజల్లుతుందని గ్రామ మాజీ ఉప సర్పంచ్ నరేష్ కుమార్ యాదవ్, గ్రామస్తులు వాపోయారు.

చెరువులో నీరు పచ్చగా మారి దుర్వాసన వెదజల్లుతుందని చెరువు నీటిని తాగిన పశువుల శరీరాలపై పుండ్లు ఏర్పడి మృత్యువాత పడుతున్నాయని, నీటిని పంట పొలాలకు వాడుతుండడంతో పచ్చటి పంట పొలాలు మురిగిపోతున్నాయని, బత్తుల మల్లయ్య చెందిన ఎకరా వరి పొలం పూర్తిగా పాడైపోయిందని తెలిపారు. అంతేకాక కొత్తచెరువు మధ్యలో గ్రామానికి త్రాగునీరు అందించేందుకు బావిని తవ్వి అందులో బోర్ కూడా వేయడం జరిగిందని, ఆ నీటిని తాగుతున్న గ్రామస్తులు కూడా రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చెరువులో కలుస్తున్నకలుషిత  నీళ్ల గురించి ఎంపీడీవో శ్రీనివాసరావుకు పంచాయతీరాజ్ అధికారుల కు గ్రామస్తులు సమాచారం అందించటంతో వారు కూడా చెరువు నీటిని, అనారోగ్యం బారిన పడున పశువులను, పాడైన పంట పొలాలను పరిశీలించారు. పంచాయతీరాజ్ వర్క్ ఇన్స్పెక్టర్ అనంత ప్రసన్న రాణి గ్రామస్తులతో కలిసి నాగరాల సమీపంలో గల ఆల్ ఆజీజ్ ఆగ్రో ఇండస్ట్రీస్( బాయిలర్ రైస్ మిల్) నుంచి వచ్చే కలుషిత నీరు పరిశీలించారు.

బాయిలర్ రైస్ మిల్ సమీపంలో రెండు పెద్ద గుంతల్లో మిల్లు నుంచి వచ్చే వ్యర్థ పదార్థాల కలుషిత నీరు నిలువ ఉండటం, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వర్షపు నీరు అందులో కలిసి కాలువల ద్వారా చెరువులోకి కలుషిత నీరు వచ్చి చేరుతున్నట్లు గుర్తించారు. కలుషిత నీరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బాయిలర్ రైస్ మిల్ యజమాని వాహిద్ హెచ్చరించారు. అయితే ఇలాంటి కలుషిత నీటితో పంట పొలాలకు పశువులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, తాను ఆ కలుషిత నీటినే తన మామిడి తోటకు పంట పొలాలకు ఉపయోగించుకుంటున్నానని బాయిలర్ రైస్ మిల్ యజమాని గ్రామస్తులకు  సమాధానం చెప్పారు. కలుషితనిటీ వల్ల చెరువు నీళ్లు పాడవడంతో తమకు న్యాయం చేయాలంటూ రైతులు మిల్లు యజమానితో వాగ్వాదం కు దిగారు.మరో మరో మిల్లు నుంచి వచ్చే కలుషిత నీరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని, రోగాల బారిన పడిన పశువులకు చికిత్స చేయిస్తానని మిల్లు యజమాని గ్రామస్తులకు తెలిపారు. కలుషిత నీరు చెరువులోకి రాకుండా మిల్లు యజమానిపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Source link

Leave a Comment