దిశ, వెబ్‌డెస్క్ : 10 రోజులలో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో అనేక పెద్ద బ్రాండ్లు, ఇ-కామర్స్ కంపెనీలు పండుగ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అలాంటి సమయంలో ‘గ్రీన్‌వాషింగ్’ నుండి మిమ్మల్ని రక్షించడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇంతకీ ఈ గ్రీన్‌వాషింగ్ అంటే ఏమిటి, అది మీకు ఎలా హాని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశ ప్రజలు వారి ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో మార్కెట్ చాలామంది వ్యాపారులు ఆరోగ్యకరమైన, పర్యావరణ సురక్షిత ఉత్పత్తులను అందిస్తున్నామంటూ, అది వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడతాయంటూ ప్రచారాలు చేస్తుంటారు. ఈ ఉత్పత్తుల ద్వారా అనేక ప్రయోజనాలు పొందొచ్చని కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్ చేస్తాయి. దీన్ని మార్కెటింగ్ భాషలో ‘గ్రీన్‌వాషింగ్’ అంటారు.
గ్రీన్‌వాషింగ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రణాళికలు..
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి ఖరే గ్రీన్‌వాషింగ్ సమస్య పై ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. గ్రీన్‌వాషింగ్‌కు ఎటువంటి ఆధారం లేదని, అయితే ఇది పూర్తిగా తగని వ్యాపారం అని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోందని, త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు తప్పుదారి పట్టించే ప్రకటనలను నియంత్రించడానికి కూడా పని చేస్తాయని చెబుతుంది.
బడా కంపెనీలు, పరిశ్రమతో అనుబంధం ఉన్న వ్యక్తులు తమ ఉత్పత్తులను సామాన్యుల ఆరోగ్యానికి మంచిదని నమ్మే విధంగా తమ ఉత్పత్తులను అందజేస్తుంటాయని, కానీ ఇది పూర్తి విరుద్ధంగా ఉంటుందని నిధి ఖరే అన్నారు. దీనిని గ్రీన్‌వాషింగ్ లేదా హెల్త్‌వాషింగ్ అంటారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
దీపావళి అమ్మకాల పై ప్రభుత్వం కన్ను..
ఇదొక్కటే కాదు, పండుగ సీజన్ కోసం ఈ-కామర్స్ కంపెనీలు తీసుకురాబోయే అమ్మకాల పై కూడా ప్రభుత్వం నిఘా ఉంచుతుందని వినియోగదారుల కార్యదర్శి నిధి ఖరే స్పష్టం చేశారు. కంపెనీలు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రజాదరణ పొందిన ఆఫర్‌లు, నకిలీ ఆఫర్‌ల పై ప్రభుత్వం నిఘా ఉంచుతుంది. వాటి పై చర్యలు తీసుకుంటుంది. దీని కోసం ప్రభుత్వం దీపావళి పండుగ వరకు యాక్షన్ డ్రైవ్ కూడా నిర్వహిస్తుంది.
వినియోగదారులను మోసం చేసే ప్రతి ఆఫర్ పై ఈ-కామర్స్ కంపెనీల పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నిధి ఖరే చెప్పారు. అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు సంబంధించి ప్రభుత్వం విచారణ, జరిమానాలు విధించేందుకు చర్యలు తీసుకోవచ్చు.