కాళేశ్వరంను ఉదాహరణగా తీసుకొండి … యువ ఇంజనీర్లకు సీఎం రేవంత్​ రెడ్డి సూచన

By Margam

Published on:

Follow Us
కాళేశ్వరంను ఉదాహరణగా తీసుకొండి … యువ ఇంజనీర్లకు సీఎం రేవంత్​ రెడ్డి సూచన


Telegram Channel Join Now

  • ఎలాంటి తప్పు చేయకూడదో నేర్చుకొండి
  • కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకుంటే ఆ శాఖే ఉండదు
  • నాయకులు తీసుకునే నిర్ణయాలు అమలు చేయాల్సింది కాదు
  • ఉద్యోగం కాదు బావోద్వేగంగా భావించండి
  • నాణ్యత,నిబద్ధత విషయంలో రాజీపడొద్దు
  • రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు కీలకమని గుర్తించండి
  • ఇంజనీర్లు ఇకపై క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే
  • ఏఈఈలకు నియామక ఉత్తర్వుల పంపిణీలో సీఎం రేవంత్​ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉద్యోగంలో చేరాక ఎలాంటి తప్పులు చేయాలో తెలుసుకోవాలంటే గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకోవాలని సీఎం రేవంత్​ రెడ్డి యువ ఇంజనీర్లకు సూచించారు. అవినీతి,ధనదాహంతో రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన నిర్మించిన ఆ ప్రాజెక్టు కట్టడం కూలడం రెండూ జరిగి పోయాయన్నారు. దీనికి అధికారులను బాద్యుల్ని చేయాలా..? లేక రాజకీయ నాయకులనా? ఎవరిని బాధ్యులను చేయాలో చెప్పాలని ఇంజనీర్లను అడిగారు. రాష్ట్ర నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 700 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకు గురువారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న జలసౌధలో సీఎం చేతుల మీదగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ…కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే అసలు ఆ శాఖే ఉండదన్నారు. చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

కాళేశ్వరంను ఉదాహరణగా తీసుకొండి ... యువ ఇంజనీర్లకు సీఎం రేవంత్​ రెడ్డి సూచన

ఈఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు..ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావని అబిప్రాయపడ్డారు. ఫలితంగా రూ. లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారన్నారు. అసలు నిర్మాణం కంప్లీట్​ కాకముందే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును అధ్యయనం చేయాలన్నారు. గత పాలకులు ఈ ప్రాజెక్టును ప్రపంచ అద్భుతంగా వర్ణించారన్న ఆయన కుప్పకూలిన కాళేశ్వరానికి ఎవరిని బాధ్యులుగా చేయాలో సమాధానం చెప్పాలన్నారు. ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో సమర్థంగా పని చేసి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. నిర్మాణ సామగ్రి క్వాలిటీగా లేదని వెనక్కి పంపి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు.ఒక దేశం గొప్పతనాన్ని చెప్పేది ఆ దేశంలోని నిర్మాణాలు, కట్టడాలేనని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవన్నారు.

కాళేశ్వరంను ఉదాహరణగా తీసుకొండి ... యువ ఇంజనీర్లకు సీఎం రేవంత్​ రెడ్డి సూచన

చివరకు నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు ఇన్నేళ్లు ఉండేవి కావన్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు లక్షల ఎకరాలకు నీళ్లు, విద్యుత్‌ ఇస్తున్నాయన్న ఆయనఐదేళ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం అప్పుడే కూలిపోయిందని ఆక్షేపించారు. పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించాలన్నారు. రూ. 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. భవిష్యత్తులోలో ఇలాంటివి పునరావృతం కావొద్దనే సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకమన్న ఆయన ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాలని యువ ఇంజనీర్లకు సూచించారు.ఉన్నత అధికారులు చెప్పారని నాణ్యత,నిబద్ధత విషయంలో ఎప్పుడూ రాజీపడొద్దని యువ ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సంస్కృతిలో నీళ్ల భాగస్వామ్యం ఉందన్న సీఎం అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నందుకు గర్వంగా భావించాలన్నారు. పైరవీలతో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి శిక్షించాలన్నారు. ఉద్యోగంలో చేరాక పని మీద శ్రద్ధ పెట్టాలే తప్పా పోస్టింగ్ లపై కాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు.

కాళేశ్వరంను ఉదాహరణగా తీసుకొండి ... యువ ఇంజనీర్లకు సీఎం రేవంత్​ రెడ్డి సూచన

తాము పొందిన ఉద్యోగాన్ని భావోద్వేగంగా భావించాలని నియామక పత్రాలు అందుకున్న ఇంజనీర్లకు సూచించారు. రాష్ట్ర ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉందన్న సీఎం వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారన్నారు. గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారనీ ఫీల్డ్ విజిట్ చేసాకే రిపోర్టులు రాసే వారన్నారు. కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, పొన్నం ప్రభాకర్​, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి పాల్గొన్నారు.

కాళేశ్వరంను ఉదాహరణగా తీసుకొండి ... యువ ఇంజనీర్లకు సీఎం రేవంత్​ రెడ్డి సూచన

30 రోజుల్లో డిజిటల్​ హెల్త్​ కార్డులు..!

మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్‌ హెల్త్‌కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. గురువారం హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ రెనోవా క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించిన తర్వాత మాట్లాడిన సీఎం.. విద్య, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

కాళేశ్వరంను ఉదాహరణగా తీసుకొండి ... యువ ఇంజనీర్లకు సీఎం రేవంత్​ రెడ్డి సూచన

ఈ క్రమంలో నెల రోజులలోపు 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ డిజిటలైజ్‌ చేస్తామన్నారు. హెల్త్‌కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని పేర్కొన్నారు. క్యాన్సర్‌ చికిత్స కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని మంత్రి దామోదర రాజనర్సింహకు మంత్రి సూచించారు.

Source link

Leave a Comment