కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గా వెలిచాల

By Margam

Published on:

Follow Us
కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గా వెలిచాల



Telegram Channel Join Now

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన  కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అసోసియేషన్ చైర్మన్ గా వెలిచాల రాజేందర్ రావు ఎన్నికయ్యారు. గురువారం కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ, ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ, అబ్జర్వర్ గా ఈ రామ్ చందర్, స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్ గా, యోగా కోచ్ ఈ కిష్టయ్య, ఒలంపిక్ అసోసియేషన్ నుంచి ఎన్ సిద్ధారెడ్డి అబ్జర్వర్ గా, ఎలక్షన్ ఆఫీసర్ గా చొప్పదండి పీడీ ఏ కృష్ణ వ్యవహరించారు

. ఇందులో ప్యాటరన్ గా పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాద్ రావు, అధ్యక్షుడిగా చెన్నాడీ అమిత్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సిహెచ్ సంపత్ రావు, వైస్ ప్రెసిడెంట్లుగా పీ అనుకర్, మల్లేష్ గౌడ్, ఎల్లా గౌడ్, సునీల్ రెడ్డి, సెక్రటరీగా బి మల్లేష్ గౌడ్ ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆర్గనైజేషన్ సెక్రటరీగా సుధాకర్, టెక్నికల్ చైర్మన్ గా ఎన్ లక్ష్మీనారాయణ, రెఫరీ బోర్డు చైర్మన్ గా డీ వీరన్న, సంయుక్త కార్యదర్శిగా ఏ పద్మను ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గాన్ని ఎలక్షన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికపై క్రీడా సంఘాల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

Source link

Leave a Comment