ఐపీఎల్ ప్లేయర్లకు కాసుల పంట.. ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షలు ఇవ్వనున్న బీసీసీఐ!

By Margam

Published on:

Follow Us
ఐపీఎల్ ప్లేయర్లకు కాసుల పంట.. ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షలు ఇవ్వనున్న బీసీసీఐ!


Telegram Channel Join Now
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. ప్రపంచ వ్యాప్తంగా ధనిక లీగుల్లో ఒకటి. ఈ లీగ్‌లో రెండు నెలల క్రికెట్ ఆడినా.. ఇతర లీగుల్లో ఏడాది పాటు ఆడినా.. అంతే మొత్తంలో ఆటగాళ్లకు దక్కుతుంది. ఈ లీగ్‌లో రాత్రికి రాత్రే స్టార్‌లు అయిపోయిన ఆటగాళ్లు ఎందరే. అదే సమయంలో ఇక్కడ సత్తాచాటి జాతీయ జట్టుకు ఎంపికైన వారు సైతం పదుల సంఖ్యలో ఉన్నారు. ఇక ఇక్కడ ఆడే ఆటగాళ్లకు సౌకర్యాలు సైతం అదే స్థాయిలో ఉంటాయి. ఇదే సమయంలో ప్రపంచస్థాయి మేటి ప్లేయర్లతో ఆడే అవకాశం ఈ టోర్నీలో పాల్గొనే వారికి దక్కుతుంది. అందుకే స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌, జో రూట్‌ లాంటి ప్లేయర్లు సైతం ఈ టోర్నీలో ఆడేందుకు సిద్ధంగా ఉంటారు.ఇక ఈ టోర్నీని ఆసక్తికరంగా మార్చేందుకు బీసీసీఐ ప్రతీఏటా.. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొస్తోంది. తాజాగా మరో క్రేజీ ఆలోచనతో ఎంట్రీ ఇచ్చింది. ఆటగాళ్లకు భారీగా లబ్ది చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్ ఆడే ఆటగాళ్లపై కాసుల వర్షం కురవనుంది. ఈ మేరకు ఐపీఎల్‌లో ప్లేయర్లు ఆడే ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షల చొప్పున మ్యాచ్‌ ఫీజు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా శనివారం ప్రకటించారు. వేలం ద్వారా వారు పొందే మొత్తానికి ఇది అదనమని ఆయన వెల్లడించారు. లీగ్‌ దశలో అన్ని మ్యాచ్‌లు ఆడే ప్లేయర్‌కు ఒప్పందానికి అదనంగా రూ.1.05 కోట్లు దక్కుతాయని జై షా స్పష్టం చేశారు. ఇందుకోసం ఆటగాళ్లకు చెల్లించేందుకు గానూ.. ఫ్రాంచైజీలకు సీజన్‌కు రూ.12.60 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

“ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నాం. క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును ప్రవేశపెడుతున్నాం. ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షల ఫీజును ఇవ్వనున్నాం. ఓ క్రికెటర్ ఐపీఎల్‌ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే కాంట్రాక్ ద్వారా లభించే మొత్తంతో పాటు అదనంగా రూ.1.05 కోట్లు దక్కించుకుంటాడు. ప్రతి సీజన్‌కు ప్రతి ఫ్రాంచైజీకి మ్యాచ్ ఫీజు కింద రూ.12.60 కోట్లు కేటాయిస్తున్నాం. ఇది ఐపీఎల్‌కు, ప్లేయర్లకు కొత్త శకం లాంటిది” అని జై షా ట్వీట్ చేశారు.

బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో ముఖ్యంగా భారత ప్లేయర్లకు భారీగా లబ్ది చేకూరనుంది. అన్‌క్యాపడ్, ఎమర్జెంగ్ ప్లేయర్లకు ఒకరకంగా ఇది జాక్‌పాట్ వంటిది. ఎందుకంటే రూ.20 లక్షల ధరతో ఓ జట్టు సొంతం చేసుకున్న ఆటగాడు సైతం ఆ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే.. ఆ మొత్తంతో పాటు రూ.1.05 కోట్లు పొందుతాడు. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం భారత ప్లేయర్లకు మాత్రమే వర్తిస్తుందా? విదేశీ ఆటగాళ్లకు కూడా వర్తిస్తుందా? అనే విషయంపై స్పష్టత లేదు.

Source link

Leave a Comment