ఏపీలో నేటి నుంచే కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ …

By Margam

Published on:

Follow Us
ఏపీలో నేటి నుంచే కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ …



Telegram Channel Join Now

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. దసరాకు ముందు నుంచే కొత్త వైన్ షాపులు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. కొత్త మద్యం పాలసీలో భాగంగా రూ. 99కే నాణ్యమైన మద్యం ఇవ్వాలని నిర్ణయించారు. మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించామని, వారం పాటు స్వీకరిస్తామని చెప్పారు. పదో రోజు దరఖాస్తులను డ్రా తీస్తామని మంత్రి తెలిపారు.

నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కో దానికి 2 లక్షలు చొప్పున నాన్‌ రిఫండబుల్‌ రుసుము చెల్లించాలి. డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్‌ స్టేషన్లలో అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్స్‌లు అందించనున్నారు. ఈ నెల 12 నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసింది. అయితే కొత్త దుకాణాలు ఏర్పాటు అయ్యే వరకు వీటినే కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్సు రుసుములు ఖరారు చేశారు. తొలి ఏడాది పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు, ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలుగా లైసెన్సు రుసుమును నిర్ణయించారు. రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా ఆరు విడతల్లో లైసెన్సు రుసుము చెల్లించాలి. రిటైల్‌ వ్యాపారం చేసే లైసెన్సుదారుకు 20 శాతం మేర మార్జిన్‌ ఉంటుంది.



Source link

Leave a Comment