ఏపీలో ‘దేవర’ అదనపు షోలకు అనుమతి .. ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన జూ. ఎన్టీఆర్

By Margam

Published on:

Follow Us
ఏపీలో ‘దేవర’ అదనపు షోలకు అనుమతి .. ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన జూ. ఎన్టీఆర్


Telegram Channel Join Now

దేవర సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కొద్దిసేపటి క్రితం జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన దేవర సినిమా విడుదల అవుతుంది. మొదటి రోజు ఆరు షోలకు అనుమతించిన ప్రభుత్వం తర్వాత తొమ్మిది రోజులకు ఐదు షోలకు అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సినిమా టిక్కెట్ ధరలను…

దేవర సినిమా టిక్కెట్లను కూడా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సినిమా హాళ్లలో దేవర సినిమాకు బాల్కనీ టిక్కెట్ల ధరలు 110 రూపాయలు, దిగువ క్లాస్ టిక్కెట్ అరవై రూపాయల వరకూ పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఈ నెల 27వ తేదీన దేవర విడుదల సందర్భంగా ఏపీలో దాదాపు ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమయింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా.. ‘దేవర సినిమా విడుదల నిమిత్తం నూతన జీవోని ఆమోదించినందుకు, తెలుగు సినిమా పరిశ్రమకు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడుగారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌గారికి నా ధన్యవాదాలు..’ అని పేర్కొన్నారు. తారక్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.





Source link

Leave a Comment