ఎవరు చెప్పారు బాబూ.. నెటిజన్‌పై రిషభ్ పంత్ ఫైర్‌

By Margam

Published on:

Follow Us
ఎవరు చెప్పారు బాబూ.. నెటిజన్‌పై రిషభ్ పంత్ ఫైర్‌


Telegram Channel Join Now
ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి ముందు రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఆ ఆటగాడు ఫ్రాంఛైజీని వీడుతున్నాడు.. ఈ ఆటగాడు ఆ జట్టులోకి చేరుతున్నాడు.. అని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఇందులో చాలా వరకు అసత్య వార్తలే ఉంటున్నాయి. ఇలాంటి వార్తే ఒకటే రిషభ్‌ పంత్ గురించి ప్రచారమైంది. ఇది కాస్తా అతడి దృష్టికి వెళ్లింది. దీంతో ఈ టీమిండియా వికెట్‌ కీపర్‌ కాస్త గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు. ఈ తరహా వదంతులు ప్రచారం చేయడం దుర్మార్గమని పంత్‌ వ్యాఖ్యానించాడు.

అసలేం జరిగిందంటే..

‘ఐపీఎల్‌ 2025కి ముందు రిషభ్‌ పంత్.. ఆర్సీబీలో చేరాలని భావిస్తున్నాడు. ఇందుకోసం తన మేనేజర్‌ ద్వారా రిషభ్‌ పంత్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీని సంప్రదించాడు. కెప్టెన్‌ ప్లేసు ఖాళీగా ఉంటే ఇవ్వాలని కోరాడు. కానీ, ఆ ఫ్రాంఛైజీ పంత్‌ అభ్యర్థనకు ఒప్పుకోలేదు. ఎందుకంటే పంత్‌ అక్కడకు రావడం విరాట్ కోహ్లీకి ఇష్టం లేదు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్‌లో, భారత క్రికెట్‌ జట్టులో చేసినట్లుగా అతడు ఆర్సీబీలో రాజకీయాలు చేస్తాడని.. పంత్‌ రాకను కోహ్లీ వద్దన్నాడు’ అని ట్విట్టర్‌లో ఓ యూజర్‌ పేర్కొన్నాడు.

ఆ వార్తలన్నీ అసత్యాలేనని రిషభ్ పంత్ స్పష్టం చేశాడు. ‘సోషల్ మీడియా వేదికగా ఇంత ఫేక్ న్యూస్ ఎందుకు వ్యాప్తి చేస్తున్నారు? ఎలాంటి ఆధారాలు, కారణాలు లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలను క్రియేట్‌ చేయకండి. ఇది ఇప్పుడే కొత్త కాదు. చాలా రోజుల నుంచి ఈ తప్పుడు వార్తల ప్రచారం జరుగుతోంది. కానీ, ఇన్ని రోజులూ చూసి చూడనట్లు ఊరుకున్నా. ఇప్పుడు మాత్రం దీనిని ఖండించాల్సి వచ్చింది. నేనొక్కటే చెబుతున్నా.. దయచేసి ఎప్పుడైనా ఇలాంటి వార్తలు వ్యాప్తి చేసే ముందు సంబంధిత వర్గాల నుంచి సరైన సమాచారం తెలుసుకోండి’ అని రిషభ్‌ పంత్ సూచించాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ 2016లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులోనే ఆడుతున్నాడు. తొలి నాళ్లలో కేవలం ప్లేయర్‌గానే ఆడిన పంత్.. ఆ తర్వాత కెప్టెన్‌గా ఎదిగాడు. 2021 నుంచి ఆ జట్టు సారథిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో 111 మ్యాచ్‌లు ఆడన పంత్.. అందులో 2205 రన్స్ స్కోరు చేశాడు.

ఐపీఎల్‌ 2025కి ముందు పంత్‌ ఢిల్లీని వీడనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆర్సీబీ డుప్లెసిస్‌ను వదులుకుంటుందని.. దీంతో ఆ జట్టు కెప్టెన్‌ ప్లేసు ఖాళీ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో పంత్‌ను తీసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇన్ని రోజులూ వీటిపై పంత్‌ స్పందించలేదు. దీంతో చాలా మంది ఇది నిజమే అని అనుకున్నారు. ఈ పరిస్థితుల్లో వాటన్నిటికీ చెక్‌ పెడుతూ పంత్.. గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.

Source link

Leave a Comment