- ఇద్దరిని పట్టుకున్న స్థానికులు
- మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో అప్పగింత
ముద్ర, తెలంగాణ బ్యూరో : గోషామహాల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ ఇంటి వద్ద అనుమానస్పదంగా తిరుగుతోన్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకున్నారు. వారిద్దరిని మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. దూల్ పేటలోని రాజాసింగ్ నివాస పరిసరాల్లో ఆదివారం నాడు నలుగురు వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతుండటం స్థానికులు గమనించారు.
వారిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఇద్దరు వ్యక్తులు పారిపోగా, షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాజా అనే మరో ఇద్దరు దొరికారు. ఆ ఇద్దరి మొబైల్ ఫోన్లలో రాజాసింగ్ ఫోటోలు, గన్, బుల్లెట్ ఫోటోలు ఉండటం గమనార్హం. పట్టుబడిన వారు రాజాసింగ్ ఇంటి వద్ద ఎందుకు రెక్కీ నిర్వహిస్తున్నారు?, ఆయనపై దాడి చేయడాని వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.