ఈనెల 28న తిరుమలకు కాలినడకన వైఎస్‌ జగన్‌..!

By Margam

Published on:

Follow Us
ఈనెల 28న తిరుమలకు కాలినడకన వైఎస్‌ జగన్‌..!



Telegram Channel Join Now

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఈనెల 28న తిరుమలకు కాలినడకన వెళ్లనున్నారు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలతో తిరుమల ఆలయ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను మంటగలిపారని పేర్కొంటూ వైసీపీ ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చింది. తిరుమల లడ్డూ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకుఈ పూజలకు పిలుపునిచ్చింది. దీంతో ఈనెల 28న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలు చేపట్టాలని జగన్‌ ట్విట్టర్‌ వేదిక ద్వారా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామి వద్దకు మెట్ల మార్గాన వెళ్లనున్నారు.



Source link

Leave a Comment